గ్రేటర్ ఎన్నికలపై అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు చేపడుతోంది. ఎన్నికల కమిషనర్ ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలకు ఓటరు చైతన్యంపై వివరించగా.. మరో దఫా ఎన్జీవోలు, యువతతో సమావేశం కానున్నారు. ఇదివరకు కొందరికే పరిమితమైన పోస్టల్ బ్యాలెట్‌ను ఈ సారి దివ్యాంగులు, 80ఏళ్ల వయసు దాటిన వారూ వినియోగించుకునే వీలు కల్పించింది.
2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 10 డివిజన్లలో 20 శాతం లోపు, 18 డివిజన్లలో 21- 30శాతం మధ్య, 62 డివిజన్లలో 31-40 మధ్య, 47 డివిజన్లలో 41-50 మధ్య మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా.. సూరారంలో 16.44, రెయిన్‌బజార్ 15.61, తలాబ్‌చంచలం 14.78, మూసారాంబాగ్ 13.24, ఆజంపురాలో 10.60శాతం పోలింగ్ నమోదు అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు నగరంలో 74లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 20-29 వయసు గల వారు 15 లక్షల పైచిలుకే. వీరందరినీ పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నారు.