తెలంగాణ

telangana

ETV Bharat / city

రఘురామను రమేశ్‌ ఆస్పత్రికి పంపడంపై ఏఏజీ అభ్యంతరం - రఘరామకృష్ణరాజు

ఎంపీ రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదిక ఇచ్చింది. ఎంపీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని నివేదికలో పేర్కొంది. రఘురామ కేసులో జీజీహెచ్‌ వైద్య నివేదికను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు చదివారు. సీఐడీ కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

mop raghu rama krishna raju
mop raghu rama krishna raju

By

Published : May 16, 2021, 10:44 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజును చికిత్స కోసం రమేశ్‌ ఆస్పత్రికి తరలించాలన్న అంశంపై ఏపీ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దీనిపై ఆ రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్ (ఏఏజీ) అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్‌ ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్య బృందం నివేదిక ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. జీజీహెచ్‌ వైద్య బృందం నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివారు.

'రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టుకు వైద్యుల బృందం నివేదిక అందజేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. సీఐడీ కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిందిగా శనివారం సాయంత్రం 6.40కి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది' అని ఏజీజీ వివరించారు. ప్రైవేటు వైద్యులు, సీఆర్‌పీఎఫ్‌ భద్రతను హైకోర్టు తిరస్కరించిందని చెప్పారు. జీజీహెచ్‌ బృందం ఏర్పాటు అంశాన్ని ఈ సందర్భంగా ఏఏజీ హైకోర్టుకు వివరించారు.

స్వయంగా హైకోర్టే జీజీహెచ్‌ బృందాన్ని ఏర్పాటు చేసిందని... నిన్న రాత్రి 8.30 సీఐడీ కోర్టు రమేశ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పిందని, హైకోర్టు ఆదేశాల తర్వాత సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కోర్టుకు ఏఏజీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై సీఐడీ కోర్టు దృష్టికి తమ ఏజీపీ తీసుకెళ్లారని ఏఏజీ వివరించారు. హైకోర్టు ఆర్డర్‌ కాపీ ఇస్తే తీర్పు సవరిస్తామని సీఐడీ కోర్టు చెప్పిందన్నారు.

రమేశ్‌ ఆస్పత్రికి తరలించడమంటే తెదేపా ఆఫీసుకు తరలించడమేని ఏఏజీ ఆరోపించారు. జీజీహెచ్‌ వైద్యులు నివేదిక ఇచ్చాక రమేశ్‌ ఆస్పత్రికి పంపడం సరికాదన్నారు. రమేశ్‌ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది రోగులు చనిపోయారని కోర్టుకు వివరించారు. రమేశ్‌ ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసుల అంశంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై ఏపీ సీఐడీ ఇవాళ రాత్రే అఫిడవిట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఇవీచూడండి:రఘురామను జైలు నుంచి వెంటనే ఆస్పత్రికి పంపండి: ఏపీ హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details