దేశంలోని 25 అత్యుత్తమ ఐపీఎస్‌లలో చోటు దక్కడం గర్వంగా ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ ఘనత తెలంగాణ పోలీస్ శాఖ మొత్తానిదని పేర్కొన్నారు. కేవలం తన ఒక్కని వల్లే ఈ గౌరవం దక్కలేదని తెలిపారు. హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే తనకు పేరొచ్చినట్లు చెప్పారు.
ఈ ఘనత తెలంగాణ పోలీస్ శాఖ మొత్తానిది: డీజీపీ - dgp mahendhar reddy news
దేశంలోని 25 అత్యుత్తమ ఐపీఎస్‌లలో చోటు దక్కడంపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ ఘనత తెలంగాణ పోలీస్ శాఖ మొత్తానిదని పేర్కొన్నారు. హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు చిత్తశుద్ధితో పనిచేయడం వల్లే తనకు పేరొచ్చినట్లు తెలిపారు.
dgp
సమష్టి కృషితోనే సాధ్యమైందని.... తెలంగాణ ప్రజలు పోలీసులకు ఎంతో సహకరించడం వల్లే సత్ఫలితాలొస్తున్నాయని డీజీపీ ట్వీట్ చేశారు. రాయపోలు ఠాణాలో పనిచేసే కానిస్టేబుల్ శేఖర్ భార్య రేఖను డీజీపీ అభినందించారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని మహేందర్ రెడ్డి ప్రశంసించారు.
ఇదీ చదవండి:ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ పోలీస్‌బాస్