రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో గీత జయంతిని పురస్కరించుకుని శనివారం రోజున లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 గంటల పాటు భగవద్గీత పారాయణం నిర్వహించారు. కుందన మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు ఆలపించిన గాన కచేరీ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక సంఖ్యలో భక్తులు, చిన్నారులు పాల్గొని ఫౌండేషన్ వారు అందించిన ఉచిత భగవద్గీత పుస్తకాల్ని పారాయణం చేశారు.
చిలుకూరులో 18 గంటలు భగవద్గీత పారాయణం - హైదరాబాద్లో గీతా పారాయణం
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా 18 గంటల పాటు భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిలుకూరులో 18 గంటలు భగద్గీత పారాయణం
హిందూ ధర్మాన్ని, హిందూ దేశాన్ని రక్షించే ఉత్తమ సైనికులుగా తయారవ్వాల్సిన అవసరం ఉందని చిన్నారులకు ప్రధానార్చకుడు రంగరాజన్ కర్తవ్య బోధన చేశారు. ఈ గీతా పారాయణం ఉదయం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటలకు ముగిసింది.
ఇదీ చూడండి: యువతుల్లో అభద్రతా భావంపై రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు
Last Updated : Dec 8, 2019, 11:13 AM IST