ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో తొలిసారి ప్రభుత్వం కొలువుతీరాక వృద్ధిరేట్లు చకచకా ముందుకు సాగాయి. మొదటి ఐదేళ్లలో సగటున 8 శాతం స్థాయిల్లో ఉండేది. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జీడీపీ క్షీణిస్తూ వచ్చింది. వృద్ధిరేటు 4-5 శాతం స్థాయిల్లో ఉంది. ఇక్కడితో ఈ మందగమనం ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు ఆరు సంవత్సరాల్లో అత్యల్పమైన 4.9 శాతానికి పడిపోయింది.
ఉద్దీపనలు ఫలిస్తాయా... ఆర్థిక వ్యవస్థ గాడిన పడేనా..? - gdp groth rate in modi second term analysis
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జీడీపీ వృద్ధి రేటు క్షీణిస్తూ వచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు ఆరు సంవత్సరాల్లో అత్యల్పమైన 4.9 శాతానికి పడిపోయింది. మరి కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్రకటనలతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా? హైదరాబాద్‌కు చెందిన ఆర్థికవేత్త శేఖర్‌తో ఈటీవీ భారత్ చర్చించింది.

ఉద్దీపనలు ఫలిస్తాయా... ఆర్థిక వ్యవస్థ గాడిన పడేనా..?
కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు, సంస్థలకు పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. వీటన్నింటి వల్ల పలు రంగాల్లో పారిశ్రామికోత్పత్తి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల భారీ స్థాయిలో కురిసిన వర్షాల వల్ల ప్రాథమిక రంగంలో కూడా ఉత్పత్తి పెరుగుతుందని వారు అంటున్నారు.
వృద్ధిరేటుపై ఆర్థిక నిపుణులు శేఖర్ అభిప్రాయం
TAGGED:
gdp