తెలంగాణ

telangana

ETV Bharat / city

రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల - ప్రైవేటు వర్సిటీల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల
రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

By

Published : Sep 22, 2020, 12:43 PM IST

Updated : Sep 22, 2020, 1:16 PM IST

12:39 September 22

రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా భూ హక్కులు-పట్టాదారు పాసుపుస్తకాల చట్టంతోపాటు వీఆర్వో వ్యవస్థ రద్దు చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో ఉభయసభల ఆమోదం పొందిన బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో చట్టాలుగా మారాయి. ఈ మేరకు చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  

ఈ నెల 19న గెజిట్ నోటిఫికేషన్లు ప్రచురించారు. అందుకు అనుగుణంగా న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్​బీపాస్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల, పురపాలక, పంచాయతీరాజ్, జీఎస్టీ సవరణ చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అమలు నిబంధనలను ఖరారు చేసి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.

Last Updated : Sep 22, 2020, 1:16 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details