APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్! - appsc chairman 2022
10:59 February 17
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా డీజీపీ గౌతం సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించనుంది. రెండు రోజుల క్రితం సవాంగ్‌ను డీజీపీ పోస్టు నుంచి ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తాజాగా ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
అయితే ఈ బాధ్యతలను గౌతం సవాంగ్ స్వీకరిస్తారా? లేదా? అనే విషయం చర్చనీయాంశంగా ఉంది. ఐపీఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత నామినేటెడ్ పదవిగా ఉన్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ హోదాలో చేరాల్సి ఉంటుంది. ఛైర్మన్ పదవిలో నియమితులైన వారు ఐదేళ్లు కొనసాగుతారు. సవాంగ్‌కు 2023 వరకు సర్వీస్ ఉన్నందున.. దాన్ని వదులుకుని వస్తారా? అనే అంశంపై సందిగ్ధం ఉంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియామకంపై ఇప్పటికే సవాంగ్‌తో ఏపీ ప్రభుత్వం చర్చించినట్లు ప్రచారంలో ఉంది. ఇదే సమయంలో సవాంగ్ బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది.
ఇదీచూడండి:సవాంగ్‌పై వేటు.. ఏపీ నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి