ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు(Pulichinthala project) 16వ నంబర్ గేటు వరద ప్రవాహంతో కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో కొంతమేర గేటు పైకి ఎత్తే క్రమంలో గాటర్స్లో సాంకేతిక సమస్య వల్ల 16 నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన మాదిపాడు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు. పులిచింతల డ్యాం 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయిందని ఆయన తెలిపారు. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారని, ఇందుకు డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోందని లేకపోతే నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉందని చెప్పారు.
Pulichinthala: ఊడిపోయిన గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా - పులిచింతల
ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు(Pulichinthala project) లో ఇవాళ తెల్లవారుజామున 16వ నంబర్ గేటు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకపోయింది. దీంతో లక్ష క్యూసెక్కుల మేర నీరు వృథాగా పోతోంది. నీటి వృథాను ఆపేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ సూచించారు.
ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నట్లు తెలిపారు. అధికారులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వాగులు, వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:Urea Shortage: వేధిస్తోన్న కొరత.. సరఫరాలోనే 4.85 లక్షల టన్నుల కోత