తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా - విశాఖ స్టీల్ ప్లాంట్​ కోసం రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు వార్తలు

ఏపీలోని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపారు. రాజీనామాను అంగీకరించాలని కోరారు.

రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా
రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి పంపిన గంటా

By

Published : Feb 15, 2021, 7:59 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. సొంత దస్తూరితో రాసిన లేఖను గతంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు అందజేశారు.

ఈరోజు వైజాగ్ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం ద్వారా ఎమ్మెల్యేగా తన రాజీనామా లేఖ ప్రతుల్ని అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకు గంటా శ్రీనివాసరావు అందించారు. తన రాజీనామా ఆమోదానికి సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని గంటా లేఖలో కోరారు. లేఖను తాను స్పీకర్ ఫార్మాట్​లోనే పంపించానని.. అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్ ద్వారా వివరించారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ నివేదికలు రూపొందించాలి: సీఎస్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details