తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ ఉక్కుపై జగన్​తో కలిసి పోరాడుతాం: మాజీ మంత్రి గంటా

ఏపీలోని విశాఖ ఉక్కుపై అందరం కలిసి పోరాడాలని.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలన్నారు. ప్రధానిని సీఎం జగన్ కలిసినప్పుడు ఉక్కు విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

We will fight together with Jagan on Visakhapatnam Steel: Former Minister Gunta
విశాఖ ఉక్కుపై జగన్​తో కలిసి పోరాడుతాం: మాజీ మంత్రి గంటా

By

Published : Mar 9, 2021, 2:17 PM IST

విశాఖ ఉక్కుపై కేంద్రం వైఖరిని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని.. ఈ విషయంపై అందరం కలిసి పోరాడాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర పెద్దలు మాత్రం ఇంకా ఏమీ జరగలేదంటూ.. తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ విషయం ముగిసిన అధ్యాయమని ఆర్థిక మంత్రి అన్నారని.. రాష్ట్రానికి సైతం సమాచారం అందిస్తున్నామని నిర్మలాసీతారామన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

జగన్ ఎందుకు ప్రస్తావించలే..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు.. సీఎం జగన్​తో కలిసి పనిచేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరణకు.. రాష్ట్ర భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలని గంటా అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం పోరాడేందుకు దిల్లీలో పాదయాత్రకు తాము సిద్ధంగా ఉన్నామనీ.. అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రధానిని సీఎం కలిసినప్పుడు.. ఉక్కు విషయం ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కుపై వైకాపాతో కలిసి పోరాడుతాం

జనసేన పోరాడాలి..

స్టీల్​ప్లాంట్​పై పవన్​ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల తరపున జనసేన అధినేత పోరాడాలని గంటా అన్నారు. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని.. కార్యచరణ ప్రణాళిక ప్రకటించాలని జగన్​ను కోరుతున్నామని తెలిపారు. రాజీనామా చేస్తే.. తెదేపా పోటీ పెట్టపోదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:శిథిలావస్థలో చారిత్రక భవనం.. అభివృద్ధి చేయాలని ప్రజల విన్నపం

ABOUT THE AUTHOR

...view details