నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.గంగాధర్‌ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి (ఓఎస్‌డీ)గా డిప్యుటేషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ అయిన ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఆయన నిర్వర్తించే విధులతో పాటు అదనంగా సీఎంవో బాధ్యతలు చేపడతారని పేర్కొంది.
సీఎంవో ప్రత్యేకాధికారిగా గంగాధర్ - Gangadhar is appointed as Telangana CMO Special Officer
నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.గంగాధర్‌ను సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి(ఓఎస్‌డీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నిర్వర్తించే విధులతో పాటు అదనంగా సీఎంవవో బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది.
రాష్ట్ర కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయనను ఇటీవలే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వైద్యనిపుణుల ప్రధానకమిటీ సభ్యుడిగానూ కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయన దిల్లీలో ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. తెలంగాణలో వైద్యఆరోగ్యశాఖను సీఎం నిర్వహిస్తుండగా అనుభవజ్ఞులైన నిపుణులను ప్రత్యేక బాధ్యతల్లోకి తీసుకుంటున్నారు. విశేషానుభవం దృష్ట్యా గంగాధర్‌ను తన కార్యాలయంలోకి తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే సీఎం కార్యాలయంలో ప్రియాంక, శ్రీధర్ దేశ్‌పాండే, దేశపతి శ్రీనివాస్‌లు ప్రత్యేకాధికారులుగా ఉండగా గంగాధర్ నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది.