తెలంగాణ

telangana

ETV Bharat / city

బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు - బెజవాడలో గ్యాంగ్ వార్

ఆంధ్రప్రదేశ్​లోని బెజవాడలో మరో గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్ వార్ తరహాలోనే ఇదీ చోటుచేసుకుంది. మారణాయుధాలతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు 11 మందిని అరెస్ట్ చేసి.. వారి నుంచి కర్రలు , కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు
బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు

By

Published : Aug 11, 2020, 12:50 PM IST

బెజవాడలో మరో గ్యాంగ్ వార్.. మారణాయుధాలతో దాడులు

బెజవాడ నగరంలోని పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ తరహా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్‌ అనే యువకుల వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీన రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్‌ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో నాగుల్‌మీరా వర్గానికి చెందిన ఈసబ్‌, సాయికుమార్‌ తదితరులు అయోధ్యనగర్‌ బసవతారకనగర్‌ రైల్వే క్యాబిన్‌ సమీపంలో వినయ్‌, రాహుల్‌ తదితరులపై కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు.

దాడుల తర్వాత..

పరస్పర దాడుల తర్వాత ఇరువర్గాలు బయటకు రాలేదు. అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్‌ ఈసబ్‌ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్‌(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్‌(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్‌ (20)లతో పాటు మరికొందరు దాడి చేసినట్లు అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పుట్టా వినయ్‌ ఫిర్యాదు చేసిన వారిలో నాగుల్‌మీరా, ఈసబ్‌, సాయికుమార్‌, సాయిపవన్‌, కంది సాయికుమార్‌లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

కత్తులు స్వాధీనం...

అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం చేసుకున్నామని, దాడి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. తనపై 9 మంది వ్యక్తులు కత్తులు, ఇతర మారణాయుధాలతో కేదారేశ్వరపేట ప్రాంతంలో దాడి చేశారంటూ షేక్‌ నాగుల్‌మీరా (మున్నా) ఆదివారం సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సోమవారం ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్‌, పటమటకు చెందిన సాయికిరణ్‌, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌, వికాస్‌ అనే యువకులను అరెస్టు చేసినట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు. వీరి నుంచి సైతం కత్తులు స్వాధీనం చేసుకున్నామని, మరో అయిదుగురు కోసం గాలిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:మూడు రాజధానుల నిర్ణయం... వారికి శరాఘాతం!

ABOUT THE AUTHOR

...view details