జంటనగరాల్లో లంభోదరుడి నిమజ్జనం(ganesh immersion hyderabad) శోభాయమానంగా సాగుతోంది. ఈ ప్రక్రియను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రత్యేక హెలికాప్టర్లో పర్యవేక్షించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతోన్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాన్ని(ganesh immersion hyderabad) మంత్రులు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన మంత్రులు.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. మంత్రుల వెంట డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఉన్నారు.
Ganesh Immersion Hyderabad: హైదరాబాద్లో గణేశుల శోభాయాత్ర ఏరియల్ వ్యూ చూశారా..? - hyderabad ganesh
హైదరాబాద్లో గణేశుని నిమజ్జనం(ganesh immersion hyderabad) ప్రక్రియ కన్నుల పండువగా సాగుతోంది. ఈ ప్రక్రియను(ganesh immersion hyderabad) మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ఏరియల్ వ్యూ (aerial view of hyderabad) ద్వారా పరిశీలించారు.
లక్షలాది మంది పాల్గొనే హైదరాబాద్లో నిర్వహించే గణేష్ శోభాయాత్రకు(ganesh immersion hyderabad) దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం చేసిన చర్యల వల్ల శోభాయాత్ర, నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. సంప్రదాయాలను పాటించడంలో, పండుగలు ఘనంగా నిర్వహించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని పేర్కొన్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా సాగే నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
ఇదీ చూడండి: