బ్రెసెల్స్‌లో ఘనంగా ముగిసిన నిమజ్జనం వేడుకలు గణేశ్ మహోత్సవ్ 2021 పేరుతో బెల్జియం రాజధాని బ్రెసెల్స్‌లో ఈ ఏడాది తొలిసారిగా భారతీయులు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న భారతీయుల సంఘం సీజన్స్ అండ్ అకేషన్స్ తరఫున సాగర్ సింగంశెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో బ్రెజిల్స్తో పాటు నెదర్లాండ్స్, లక్సంబర్గ్ నుంచి కూడా తెలుగు వారు తరలివచ్చారు. సుమారు 400 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సోమవారం చివరిరోజు గణపతి నిమజ్జనాన్ని అంతే ఉత్సాహంతో నిర్వహించారు. 3 రోజుల పాటు సందడిగా పూజలు అందుకున్న 3 అడుగుల మట్టి విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
బ్రెసెల్స్‌లో ఘనంగా ముగిసిన నిమజ్జనం వేడుకలు 1500 యూరోలకు లడ్డూ వేలం
బ్రెసెల్స్‌లో ఘనంగా ముగిసిన నిమజ్జనం వేడుకలు ఈ వేడుకల్లో మట్టి విగ్రహమే కాదు.. 15 కిలోల లడ్డూనూ స్థానికంగా ఉన్న తెలుగువారు సిద్ధం చేశారు. ఈ లడ్డూను వేలం వేయగా హేమ కిరణ్ 1,500 యూరోలు (లక్షా 50వేలు) చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ డబ్బును బ్రజెల్స్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వాలని సీజన్స్ అండ్ అకేషన్స్ సంస్థ నిర్ణయించింది. తొలిసారి నిర్వహించిన చవితి వేడుకలు విజయవంతం కావడంతో.. రాబోయే రోజుల్లో వచ్చే పండుగలను ఇదే ఉత్సాహంతో మరింత వైభవంగా నిర్వహించాలని ఆర్గనైజర్లు నిర్ణయించారు.
బ్రెసెల్స్‌లో ఘనంగా ముగిసిన నిమజ్జనం వేడుకలు ఇదీ చదవండి :Vinayaka Chavithi: విదేశాల్లో వినాయకచవితి వేడుకలు