తెలంగాణ

telangana

ETV Bharat / city

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మేయర్​​ - గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మేయర్​​

గణేష్​ నిమజ్జన ఏర్పాట్లను మేయర్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పరిశీలించారు. ఈసారి ఖైరతాబాద్​ వినాయకుడు పూర్తిగా నీటిలో మునిగేందుకు ట్యాంక్​ బండ్​లో తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మేయర్​​

By

Published : Sep 6, 2019, 5:49 PM IST

ఈనెల 12న జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్​కుమార్​తో కలిసి మంత్రి పరిశీలించారు. ట్యాంక్ బండ్​లో దాదాపు 50 వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని మంత్రి తెలిపారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో రహదారి మరమ్మతులు, అదనపు విద్యుత్​ దీపాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

గతేడాది మాదిరిగానే ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఉదయం సమయంలోనే నిమజ్జనం చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడు ట్యాంక్​బండ్​లో పూర్తిగా మునిగే విధంగా నిమజ్జన ప్రాంతంలో తవ్వకాలను చేపడుతున్నామని వివరించారు.

గణేష్​ శోభయాత్ర జరిగే మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు.

గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, మేయర్​​

ఇవీ చూడండి: 'నగరంలో నిమజ్జనం కోసం 34 కొలనుల ఏర్పాటు'

ABOUT THE AUTHOR

...view details