తెలంగాణ

telangana

ETV Bharat / city

కలుషిత నీటి సమస్య పరిష్కరించాలని మహిళల ఆందోళన - Contaminated water problem in Gandhinagar

ఓవైపు కరోనా మహమ్మారి పీడిస్తుంటే.. మరోవైపు కలుషిత నీటితో అనారోగ్యానికి గురవుతున్నామంటూ హైదరాబాద్ గాంధీనగర్ డివిజన్​లోని బాకారం వాసులు ఆవేదన చెందుతున్నారు. ఏడాది నుంచి తమ సమస్య పరిష్కరించాలని మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

polluted water problem, polluted drinking water
కలుషిత నీరు, కలుషిత నీటి సమస్య, గాంధీనగర్ డివిజన్

By

Published : Apr 16, 2021, 7:19 PM IST

హైదరాబాద్ గాంధీనగర్​ డివిజన్​లోని బాకారంలో కలుషిత నీటి సమస్యతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. ఏడాది నుంచి తమ సమస్యను మొరపెట్టుకున్నా.. జల మండలి, జీహెచ్​ఎంసీ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అపార్ట్​మెంట్ బిల్డర్.. డ్రైనేజీ కనెక్షన్​ను తమ ప్రాంతంలో కలపడం వల్ల నీరు కలుషితమవుతోందని వాపోయారు.

కలుషిత నీటి సమస్య పరిష్కరించాలని మహిళల ఆందోళన

కలుషిత నీటి సమస్య పరిష్కారం విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదని మహిళలు ఆరోపించారు. స్థానికుల నిరసన విషయం తెలుసుకున్న జలమండలి అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా.. మహిళలు వెనక్కి తగ్గలేదు. ఇన్ని రోజులు ఏం చేశారని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details