'గాంధీకి సీఎం రావడం.. రోగులు, వైద్యుల్లో ఆనందం నింపింది' - ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన... కొవిడ్ రోగులు, వైద్య సిబ్బందిలో మనోధైర్యం నింపిందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై సీఎం ఆరాతీశారని... సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొవిడ్ రోగులకు అందించే ఔషధాలు, ఆక్సిజన్‌కు కొరత లేదని స్పష్టంచేశారు ప్రస్తుతం. గాంధీలో 20 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వివరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే... మూడో దశను నివారించవచ్చంటున్న గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
!['గాంధీకి సీఎం రావడం.. రోగులు, వైద్యుల్లో ఆనందం నింపింది' gandhi superintendent happy about cm kcr visit in gandhi hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11819780-1030-11819780-1621427434102.jpg)
"ఆస్పత్రిలో అందిస్తున్న చికిత్సపై కొవిడ్ రోగులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. సీఎం రావడం రోగులు, వైద్యుల్లో ఆనందం నింపింది. వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. గురువారం రోజు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపిస్తాం. గాంధీ లైబ్రరీలో 300పడకలు అందుబాటులోకి తెస్తాం. ఆస్పత్రిలో ఆక్సిజన్ లభ్యతపై సీఎం ఆరా తీశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే మూడోదశను నివారించవచ్చు. గాంధీ ఆస్పత్రిలో 20 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. ఆస్పత్రిలో ఔషధాలకు ఎలాంటి కొరత లేదు."- గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు