గాంధీ ఆస్పత్రిలో జూడాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. నాన్ కోవిడ్ సేవల ప్రారంభించటం సహా... కరోనా నోడల్ కేంద్రాన్ని టిమ్స్‌కు తరలించాలంటూ... జూడాలు మూడ్రోజులుగా నిరసనలకు దిగారు. దాదాపు 200మందికిపైగా జూనియర్ వైద్యులు శుక్రవారం ఉదయం విధులు బహిష్కరించి ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించారు.
' ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించం' - గాంధీలో జూడాల ధర్నా
కొవిడ్ నోడల్ కేంద్రాన్ని టిమ్స్‌కి తరలించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రికి జూడాలు చేపట్టిన నిరసన మూడోరోజుకు చేరింది. గాంధీలో కొవిడ్ పడకలను 200కు పరిమితం చేసేంతవరకు తమ ఆందోళన విరమించేది లేదని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.
' ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించం'
9 నెలలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కరోనా రోగులకు సేవలందిస్తున్నామని చెప్పారు. గాంధీలో కొవిడ్ పడకలను 200కు పరిమితం చేసి.. నోడల్ కేంద్రంగా టిమ్స్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన విరమించబోమని తేల్చిచెబుతున్నారు
ఇవీ చూడండి:టోకెన్లకోసం కార్యాలయాల వద్ద రోజుల తరబడి పడిగాపులు