గాంధీజీ మార్గంలోనే ప్రజలంతా ముందుకు నడవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్1 లోని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ త్యాగం వల్లే దేశానికి స్వాతంత్య్రం లభించిందని... అహింసా మార్గంతోనే తెల్ల దొరలపై విజయం సాధించారని కృష్ణారావు గుర్తుచేశారు.
'గాంధీజీ మార్గంలోనే ప్రజలంతా ముందుకు సాగాలి' - గాంధీ జయంతి వేడుకలు 2020
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రోడ్ నంబర్ 1లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
gandhi jayanti celebrations in kukatpally
ప్రస్తుతమున్న విగ్రహం ప్రదేశంలో... రూ.10 లక్షలతో 8అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 114 డివిజన్ కేపీహెచ్బీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, తెరాస సీనియర్ నాయకులు సాయి బాబు చౌదరి,కార్యకర్తలు పాల్గొన్నారు.