హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం కేసు మిస్టరీ వీడింది. అనారోగ్యంతో ఉన్న బావకు సాయంగా వచ్చిన తనపై, తన అక్కపై సామూహిక అత్యాచారం చేశారంటూ.... మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగురోజులపాటు విచారించిన పోలీసులు... అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. ముందుగా చెల్లెలు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేయగా... ఆరోపణలకు తగిన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సాంకేతికతను ఉపయోగించుకున్నారు. వైద్య నివేదికలోనూ అత్యాచారం జరగలేదని తేలింది. గాంధీ ఆస్పత్రి రేడియోగ్రాఫర్ ఉమామహేశ్వర్‌కు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని... సూపరింటెండెంట్ రాజారావుకు పోలీసులు తెలిపారు.
ఆమె ఇష్టంతోనే సెక్యూరిటీ గార్డుతో...
చెల్లెల్ని ప్రశ్నించడంతో అసలు విషయం ఒప్పుకుంది. మహిళలిద్దరికీ కల్లు తాగే అలవాటుందని... మూడ్రోజులుగా కల్లు దొరకకపోవడంతో వాళ్లిద్దరూ ఆస్పత్రి వార్డులోంచి బయటకి వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అక్క ఆస్పత్రి నుంచి బయటకి వెళ్లగా... చెల్లెలు దవాఖానా ఆస్పత్రి ఆవరణలోనే ఉండిపోయింది. అక్కడే చెల్లికి ఒక సెక్యూరిటీ గార్డు పరిచయమయ్యాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన క్రమంలో 15వ తేదీ తెల్లవారుజామున... ఒంటిపై దుస్తులు లేని స్థితిలో చెల్లెలు ఆస్పత్రి ఆవరణలో ఉంది. ఆమె గురించి ఉమామహేశ్వర్ రోగికి ఫోన్ చేసి చెప్పడంతో... అతని కుమారుడు ఆస్పత్రికి వచ్చి యువతిని తీసుకెళ్లాడు. బంధువులు ఏం జరిగిందని ప్రశ్నించగా... అక్క ఇంటికి రాలేదన్న భయంతో... అత్యాచారం కథ అల్లిందని పోలీసులు వెల్లడించారు.
అందులోనూ నిజం లేదు..