తెలంగాణ

telangana

ETV Bharat / city

కోఠి డీఎంఈ కార్యాలయం బయట నర్సుల ధర్నా.. పలువురు అరెస్ట్​ - గాంధీ నర్సులు అరెస్ట్​

14 సంవత్సరాలుగా పని చేస్తున్న తమను విధులకు క్రమబద్ధీకరించాలని గాంధీ నర్సులు కోఠి డీఎంఈ కార్యాలయం బయట రెండో రోజు ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు.

కోఠి డీఎంఈ కార్యాలయం బయట నర్సుల ధర్నా.. పలువురు అరెస్ట్​
కోఠి డీఎంఈ కార్యాలయం బయట నర్సుల ధర్నా.. పలువురు అరెస్ట్​

By

Published : Jul 11, 2020, 1:11 PM IST

హైదరాబాద్ కోఠి డి.ఎం.ఈ కార్యాలయం బయట గాంధీ నర్సుల రెండో రోజు ఆందోళన కొనసాగించారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ విధానంలో 14 సంవత్సరాలుగా పని చేస్తున్నామని.. తమ విధులను క్రమబద్ధీకరించాలని వివిధ రూపాల్లో నిరసన తెలిపిన్నప్పటికి... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందన్నారు. ప్రభుత్వ అధికారులు, గుత్తే దారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

క్రమబద్ధీకరణపై సంబంధింత అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని వారు గేటు ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు.

కోఠి డీఎంఈ కార్యాలయం బయట నర్సుల ధర్నా.. పలువురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details