తెలంగాణ

telangana

ETV Bharat / city

గాంధీభవన్‌కు కరోనా సెగ.. వారం రోజులు కార్యాలయం బంద్​ - GANDHI BHavan latest news

హైదరాబాద్​ నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో కరోనా కలకలం మొదలైంది. కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసిన సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధరణయింది. దీంతో వారం రోజుల పాటు గాంధీభవన్‌ మూసివేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Gandhi BhavanGandhi Bhavan Corona Effect Corona Effect
Gandhi Bhavan Corona Effect

By

Published : Jul 15, 2020, 7:05 PM IST

హైదరాబాద్ నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో కరోనా కలకలం మొదలైంది. కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పనిచేసిన సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వారం రోజుల పాటు గాంధీభవన్‌ మూసివేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాంధీభవన్‌కు చేరుకుని శానిటైజేషన్‌ చేస్తున్నారు. వీ హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బలమూర్ వెంకట్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు.

కరోనాతో మాజీ మైనారిటీ సెల్ నాయకులు సిరాజుద్దీన్, టీపీసీసీ కార్యదర్శి నరేందర్ మృతి చెందారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.

ABOUT THE AUTHOR

...view details