ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని ఇటీవల సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది.
డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకున్న గాలి జనార్దన్ రెడ్డి - సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఉపసంహరించుకున్న గాలి
ఓఎంసీ కేసు నుంచి తనను తొలగించాలని ఇటీవల సీబీఐ కోర్టు గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయస్థానం వాయిదా వేసింది.

డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకున్న గాలి జనార్దన్ రెడ్డి
గాలి జనార్దన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ను వెనక్కి తీసుకోవడానికి అనుమతివ్వాలన్న ఆయన తరఫు న్యాయవాది వాదనను కోర్టు అంగీకరించింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. తదుపరి విచారణను ఈ నెల 25కు న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇదీ చూడండి:విద్యుత్ ఉద్యోగుల విభజనపై విచారణ వాయిదా