Parliament winter sessions 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల అంశంపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమిచ్చారు. ప్రాజెక్టులు అప్పగించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. అనుమతి లేని అన్ని ప్రాజక్టుల పనులు ఆపాలని జులైలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేఆర్‌ఎంబీని కోరినట్లు చెప్పారు.
Parliament winter sessions 2021: ఇప్పటి వరకూ ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వలేదు: షెకావత్ - rajya sabha live
ప్రాజెక్టులు అప్పగించే విషయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో తెలిపారు. అనుమతి లేని అన్ని ప్రాజక్టుల పనులు ఆపాలని జులైలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కేఆర్‌ఎంబీని కోరినట్లు చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

డీపీఆర్ ఇవ్వలేదు
ప్రాజక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని కేఆర్‌ఎంబీ రెండు ప్రభుత్వాలనూ కోరిందని ఆయన అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం కేఆర్‌ఎంబీ(KRMB), జీఆర్‌ఎంబీ(GRMB) రెండు వేర్వేరు సబ్ కమిటీలు వేశాయని చెప్పారు. ఈ కమిటీల్లో రెండు ప్రభుత్వాల అధికారులు, బోర్డుల అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు సంబంధించి 'సీడ్ మనీ'ని ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలూ జమ చేయలేదని చెప్పారు. ఇప్పటి వరకు ప్రాజక్టుల డీపీఆర్‌లు అందించలేదని సభలో వెల్లడించారు.
ఇదీ చదవండి:Krishna Tribunal Hearing in SC: '48 గంటల్లోపు అఫిడవిట్ దాఖలు చేయండి'