తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్.. రఘునందన్, వేముల సరదా ముచ్చట - తెలంగాణలో రాష్ట్రపతి ఓటింగ్‌లో సరదా సంఘటన

Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి, భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ రావు మధ్య సరదా చర్చ జరిగింది. రాష్ట్రం నుంచి భాజపా అభ్యర్థికి ఒకే ఓటు పడిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అనగా.. ప్రశాంత్ రెడ్డి మంచివారేనని.. అప్పుడప్పుడు లెక్కలు మరిచిపోతుంటారని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

Presidential Election 2022
Presidential Election 2022

By

Published : Jul 19, 2022, 10:09 AM IST

Presidential Election 2022 : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డి, భాజపా శాసనసభ్యుడు రఘునందన్‌రావు మధ్య సరదా చర్చ జరిగింది. బ్యాలెట్ బాక్సును స్టోర్‌రూంలో రూంలో సీల్‌చేసి వస్తున్న క్రమంలో ఎదురుపడిన రఘునందన్‌రావును ఉద్దేశించి ప్రశాంత్‌రెడ్డి...బ్యాలెట్ బాక్స్ తీసుకొని తానే దిల్లీ పోదామని అనుకుంటున్నానని అన్నారు. దిల్లీలో తామే ముందుంటామన్న రఘునందన్ రావు... మీకు అనుమతివ్వం కదా అని వ్యాఖ్యానించారు.

తెరాస ఎమ్మెల్యేల ఓట్లు వృధా కాబోతున్నాయని... తమకు అభినందనలు తెలపాలని భాజపా ఎమ్మెల్యే అన్నారు. ఏం జరిగేది లెక్కింపు తర్వాత తెలుస్తుందని... అపుడు చెబుతామని ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ నుంచి తమ అభ్యర్థికి అనుకున్న దానికంటే ఎక్కువ ఓట్లు వస్తాయని రఘునందన్‌రావు అన్నారు.

రాష్ట్రం నుంచి భాజపా అభ్యర్థికి ఒకే ఓటు పడిందన్న ప్రశాంత్‌రెడ్డి... మిగతా ఇద్దరు ఆత్మప్రభోదానుసారం ఓటు వేశారని వ్యాఖ్యానించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మంచివారేనని, అప్పుడప్పుడూ లెక్కలు మరిచిపోతుంటారని రఘునందన్‌రావు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details