పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు చేరాయి. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ. 308 కోట్లను పంచాయతీరాజ్ శాఖ ఆయా సంస్థల ఖాతాకు జమచేసింది. అందులో గ్రామపంచాయతీలకు రూ. 277 కోట్ల 22 లక్షలు, మండల ప్రజాపరిషత్లకు రూ. 20 కోట్ల 52 లక్షలు, జిల్లా ప్రజాపరిషత్లకు రూ. 10 కోట్ల 26లక్షలు ఇచ్చారు.
పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు.. రూ. 308 కోట్లు - పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు
అక్టోబర్ నెలకు సంబంధించిన రూ. 308 కోట్ల పల్లెప్రగతి నిధులను పంచాయతీరాజ్ శాఖ ఆయా సంస్థల ఖాతాకు జమచేసింది. ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద రూ. 6, 648 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది.
పంచాయతీరాజ్ సంస్థలకు పల్లెప్రగతి నిధులు.. 308కోట్లు
ఇప్పటి వరకు పల్లెప్రగతి కింద రూ. 6, 648 కోట్ల ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రూ. 4,528 కోట్ల 50 లక్షలు కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,155 కోట్ల 50 లక్షలు అందించారు.
ఇవీ చూడండి: 'హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలోనే మెుదటి ల్యాబ్'