తెలంగాణ

telangana

ETV Bharat / city

National Highways in Telangana : రాష్ట్రం నుంచి వెళ్లే పలు జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

National Highways in Telangana : రాష్ట్రం నుంచి పలు మార్గాల్లో 865 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. దీని కోసం రూ.22,981 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.

National Highways in Telangana
National Highways in Telangana

By

Published : Jan 3, 2022, 9:22 AM IST

National Highways in Telangana : తెలంగాణ నుంచి వెళ్లే పలు జాతీయ రహదారులకు మంచి రోజులు రానున్నాయి. పలు మార్గాలకు సంబంధించిన సవివర నివేదికలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించటంతో భూసేకరణకు మార్గం సుగమమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మార్గాలకు నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించటంతో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

రూ.22,981 కోట్లతో..

Telangana National Highways : నాగ్‌పుర్‌-హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-పనాజి, హైదరాబాద్‌-రాయపుర్‌ కారిడార్‌లలో రాష్ట్రానికి చెందిన పలు మార్గాల్లో 865 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.22,981 కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించింది. వీటిలో హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించే 158 కిలోమీటర్ల ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం కూడా ఉంది.

భూసేకరణ పూర్తయితే..

National Highways in India : నాగ్‌పుర్‌-హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని కొన్ని ప్రాంతాల్లో నాలుగు వరుసలుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆరు వరసలుగా విస్తరించనున్నారు. ఈ రహదారి ఖమ్మం మీదుగా వెళ్తుంది. ఈ రహదారి నిర్మాణమైతే హైదరాబాద్‌-విజయవాడ మధ్య 60-70 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని ప్రాథమిక అంచనా. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే మరింత స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details