తెలుగు రాష్ట్రాల రహదారులకు మహర్దశ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2021-22 బడ్జెట్లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. రూ.18,492 కోట్లతో తెలంగాణలో 1277 కిలోమీటర్ల మేర 33 జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో 11,530 కోట్ల రూపాయలతో 485 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నట్లు చెప్పారు.
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారులకు మహర్దశ
తెలంగాణలో రూ.18,492 కోట్లతో 1277 కిలోమీటర్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరోనా వల్ల హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ఆలస్యమైందని.. డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.
కరోనా కారణంగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు కాస్త ఆలస్యమైందని.. డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేయాలని సూచించారు. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 6,962 కోట్ల రూపాయలతో 787 కిలోమీటర్ల హైవే రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధికి 14,630 కోట్లను కేంద్రం కేటాయించిందని వెల్లడించారు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో 263 కిలోమీటర్లకు 8,209 కోట్ల రూపాయలు, కేంద్ర రోడ్డు,రవాణా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 609 కిలోమీటర్ల రహదారిని రూ.4621 కోట్లతో నిర్మించనున్నారు.