తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.1293 కోట్లు

రానున్న ఐదేళ్లలో హైదరాబాద్​లో ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.1,293 కోట్లు, వాయు కాలుష్య నియంత్రణకు రూ.646 కోట్ల రూపాయలు అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు రానున్నాయి.

HYDERABAD
హైదరాబాద్​లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.1293 కోట్లు

By

Published : Feb 2, 2021, 5:23 AM IST

ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు కాలుష్య నియంత్రణ కోసం హైదరాబాద్ నగరానికి రానున్న ఐదేళ్లలో రూ.1,939 కోట్ల అందనున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులు రానున్నాయి. మిలియన్ ప్లస్ నగరాల జాబితాలో భాగంగా భాగ్యనగరానికి నిధులు అందనున్నాయి.

సంవత్సరం ఘనవ్యర్థాల నిర్వహణకు వాయు నాణ్యత కోసం
2021-22 రూ.236 కోట్లు రూ.118 కోట్లు
2022-23 రూ.245 కోట్లు రూ. 122 కోట్లు
2023-24 రూ.259 కోట్లు రూ.129 కోట్లు
2024-25 రూ.274 కోట్లు రూ.137 కోట్లు
2025-26 రూ.278 కోట్లు రూ.140 కోట్లు

మొత్తంగా ఐదేళ్లలో ఘనవ్యర్థాల నిర్వహణకు 1293 కోట్లు, వాయు కాలుష్య నియంత్రణకు 646 కోట్ల రూపాయలు ఆర్థికసంఘం సిఫారసుల ద్వారా హైదరాబాద్ కు అందనున్నాయి.

ఇవీచూడండి:'రాష్ట్రానికి నిధులు తగ్గించాలని సూచించినా... తగ్గించలేదు'

ABOUT THE AUTHOR

...view details