తెలంగాణ

telangana

ETV Bharat / city

విదేశాల్లో ధాన్యం విక్రయించే అవకాశాలపై క్షేత్ర స్థాయి నివేదిక

ఇతర దేశాల్లో బియ్యం విక్రయించాలంటే పలు జిల్లాల్లో డ్రై పోర్టులను ఏర్పాటు చేయాలని ఎఫ్టీసీసీఐ ప్రణాళిక సంఘానికి సూచించింది. విదేశీ మార్కెట్​లో విక్రయించే అవకాశాలపై క్షేత్ర స్థాయి నివేదికను తయారు చేయాలన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సూచన మేరకు ఈ నివేదికను తయారు చేశారు.

విదేశాల్లో ధాన్యం విక్రయించే అవకాశాలపై క్షేత్ర స్థాయి నివేదిక
విదేశాల్లో ధాన్యం విక్రయించే అవకాశాలపై క్షేత్ర స్థాయి నివేదిక

By

Published : Jan 13, 2021, 7:32 PM IST

విదేశాల్లో బియ్యం విక్రయించాలంటే... రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ వంటి జిల్లాల్లో డ్రై పోర్టులను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ వరి కొనుగోళ్లు చేయాలని....తద్వారా రవాణా ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) ప్రణాళిక సంఘానికి సూచించింది. అదే విధంగా మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని డిచ్​పల్లి లేదా జానకంపేటలలో ఇన్లాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ) ఏర్పాటు చేయాలని సూచించింది. 'తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతి- ముందుకు సాగే అవకాశాలు' అనే అంశంపై నివేదికను ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్​కు ఎఫ్టీసీసీఐ ప్రతినిధులు అందజేశారు.

పెరిగిన సాగు నీటి వసతి వల్ల ధాన్యం దిగుబడి ఎక్కువైన దృష్ట్యా... విదేశీ మార్కెట్​లో విక్రయించే అవకాశాలపై క్షేత్ర స్థాయి నివేదికను తయారు చేయాలన్న వినోద్ కుమార్ సూచన మేరకు ఈ నివేదికను తయారు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని సనత్ నగర్​లో మాత్రమే ఐసీడీ ఉందని, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి బియ్యం రవాణా చేయాలంటే ట్రాన్స్​పోర్ట్ ఖర్చుల భారం విపరీతంగా ఉంటోందని.... అందువల్ల కేంద్ర ప్రభుత్వం కొంకోర్ సబ్సిడీని సనత్ నగర్ ఐసీడీకి వర్తింపజేయాలని సూచించింది. క్రిమిసంహారక మందుల వినియోగం పట్ల రైతులకు జాగ్రత్తలు చెప్పి వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నివేదిక తెలిపింది.

ఇదీ చదవండి: ముగిసిన అఖిలప్రియ కస్టడీ.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details