గ్రేటర్ ఎన్నికల్లో.. భాగ్యనగర వాసులకు 20వేల లీటర్ల ఉచిత నీరు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ హామీ అమలుపై జలమండలి దృష్టి సారించింది. ఏ విధంగా అమలు చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతోంది.
అక్కడ మీటరుంటేనే..
దిల్లీలో సుమారు 14 లక్షల మంది ఉచిత నీటిని పొందుతున్నారు. మీటర్లు పెట్టుకున్న వారికే 20 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి చేయడంతో నీటి పొదుపు పెరిగింది.
లెక్క తీస్తున్నారు:
మన నగరంలో అర్హులు ఎంత మంది ఉన్నారో ఆరా తీస్తున్నారు. అపార్ట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకుంటే 9 లక్షల మంది ఉంటారు. ప్రతి ఫ్లాటును కుటుంబంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్ కేటగిరీలో నెలకు కనీసం 15 వేల లీటర్లకు, ఫ్లాటుకు 9 వేల లీటర్లకు జలమండలి బిల్లులు వసూలు చేస్తోంది. 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చినా వీళ్లంతా లబ్ధిపొందనున్నారు.