తెలంగాణ

telangana

ETV Bharat / city

నిరుపేద గర్భిణులకు ఉచిత వైద్యసేవలు! - కూకట్​పల్లి తాజా వార్తలు

నిరుపేద గర్భిణులకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు అనన్య ఆసుపత్రి ముందుకు వచ్చింది. ప్రతి నెల 21వ తేదీన ఆసుపత్రికి వచ్చిన ప్రతి గర్భిణికి.. బిడ్డకు జన్మనిచ్చే వరకు కన్సల్టెన్సీ ఉచితంగా, పరీక్షల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు గైనకాలజిస్ట్ డాక్టర్ తులసి ఉష తెలిపారు.

free-health-camp-for-pregnant-ladies-in-ananya-hospital-in-hyderabad
నిరుపేద గర్భిణులకు ఉచిత వైద్యసేవలు!

By

Published : Feb 21, 2021, 7:31 PM IST

నిరుపేద గర్భిణులకు ఉచిత వైద్యసేవలు అందించనున్నట్లు కూకట్​పల్లిలోని అనన్య ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ తులసి ఉష తెలిపారు. ప్రతి నెల 21వ తేదీన ఆసుపత్రికి వచ్చిన ప్రతి గర్భిణికి.. బిడ్డకు జన్మనిచ్చే వరకు పరీక్షల్లో 50 శాతం రాయితీ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కన్సల్టెన్సీ ఉచితమన్నారు. తన తండ్రి పాటిమేడి సుదర్శన్ జ్ఞాపకార్థం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

మాతృత్వం అనేది ఆడవారికి దేవుడు ప్రసాదించిన వరం అని ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో వచ్చే ఆటుపోట్లకు, శారీరక, మానసిక ఒత్తిళ్లకు నిరుపేద మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడతారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ప్రతి నెల 21న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు నమోదు చేసుకున్న వారికి తక్కువ ఖర్చుతో ప్రసవాలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: హస్తం వీడిన కూన శ్రీశైలం గౌడ్ .. త్వరలో కమలం గూటికి

ABOUT THE AUTHOR

...view details