తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ నేటి నుంచే ప్రారంభం - మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​

రాష్ట్రంలో నాలుగో విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం... నేటి నుంచి ప్రారంభం కానుంది. పుష్కలమైన వర్షాలు కురుస్తుండటం వల్ల... ప్రధాన జలాశయాలు సహా చెరువులు, ఇతర నీటి వనరుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ నాగర్‌కర్నూల్​ జిల్లాలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

free-fish-distribution-in-telangana
రాష్ట్రంలో ప్రారంభంకానున్న ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం

By

Published : Aug 6, 2020, 5:09 AM IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురుస్తున్నందున ప్రధాన జలాశయాలు, చెరువులు, ఇతర నీటి వనరులు జల కళ సంతరించుకోవడంతో... చేప,రొయ్యపిల్లలు వదిలేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటానిచెరువులో మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్‌ చేప పిల్లలు విడుదల చేసి ఉచితచేపపిల్లల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు.

అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్పూర్ మండలం మద్దిగట్లలోని మద్దికాని చెరువు, కోడూర్ గ్రామంలోని మైసమ్మ చెరువులో చేప పిల్లలు విడిచిపెడతారు. మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా కమ్మదానం గ్రామంలోని వెంకాయకుంట చెరువులో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి.. తలసాని చేపపిల్లలు వేయనున్నారు. కరోనా దృష్ట్యా ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేసిన మత్స్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఇవీ చూడండి:తెలంగాణకు 37.67, ఏపీకి 17 టీఎంసీలు

ABOUT THE AUTHOR

...view details