Free Drinking Water to Cantonment : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని నల్లాదారులకూ ఉచిత నీటి పథకం అమలుచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులకు నెలకు 20 వేల లీటర్లు వరకు నీటిని అందించాలని జలమండలిని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే అమలుచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత నీటి సరఫరాతో ఏటా రూ.16.08 కోట్ల ఆదాయం జలమండలి కోల్పోతున్న నేపథ్యంలో బడ్జెట్‌లో ప్రభుత్వమే భర్తీ చేయనున్నట్లు మరో ఉత్తర్వులో తెలిపింది.
Free Drinking Water to Cantonment: కంటోన్మెంట్ ప్రజలకూ ఉచితనీరు - free drinking water scheme
Free Drinking Water to Cantonment : జీహెచ్‌ఎంసీ వాసులకు ఉచిత మంచినీరు అందిస్తోన్న రాష్ట్ర సర్కార్ ఇప్పుడు ఆ పథకం ఫలాలను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకూ అందించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 31, 745 కుటుంబాలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది.
నేటి నుంచి ఆధార్ లింకేజీ.. :
Free Drinking Water Scheme in Cantonment Board : గ్రేటర్‌లో 2019 డిసెంబరు నుంచి ఉచిత నీటి పథకం అమల్లోకి రాగా కంటోన్మెంట్‌కూ వర్తింపజేయాలని ఎమ్మెల్యే సాయన్న ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాశారు. పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. నల్లాలకు లబ్ధిదారుడి ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు కంటోన్మెంట్ సిబ్బంది గురువారం నుంచి రంగంలోకి దిగనున్నారు. జలమండలికి కంటోన్మెంటు బోర్డు రూ.34.17 కోట్ల బకాయి ఉంది. దీన్ని వెంటనే జమచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- ఇదీ చదవండి :ఉచిత మంచినీటి పథకం పొందే అవకాశం ఎప్పటివరకంటే..?