కరోనా ప్రభావం: శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత - Free Darshan tokens issuing stopped in tirumala
తిరుమల శ్రీవారి ఆలయంపై కోవిడ్ ప్రభావం పడింది. తిరుపతిలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. తితిదే కీలక నిర్ణయం తీసుకుంది.
![కరోనా ప్రభావం: శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత Free Darshan tokens issuing stopped in tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8693892-223-8693892-1599315534471.jpg)
కరోనా ప్రభావం: శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపేసింది. ఈ నెల 30 వరకు టోకెన్ల జారీ ఉండబోదని ప్రకటించింది. నేటి వరకు రోజుకు.. 3 వేల చొప్పున టికెట్లు జారీ చేశామని వెల్లడించింది.