Free B.tech Seats: చదువులో ర్యాంకులు సాధించని ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తుంటారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకొని వినూత్న పరిష్కారాలకు రూపం ఇచ్చి పరికరాలు, యంత్రాలు తయారు చేస్తుంటారు. అలాంటి ప్రతిభావంతులకు (గిఫ్టెడ్ చిల్డ్రన్)కు ఒక్కో కళాశాలల్లో 2 సీట్లు కేటాయిస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది.
త్వరలో కళాశాలల ఎంపిక..:విద్యాసంస్థ పనితీరు, కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ ర్యాంకింగ్(ఎన్‌ఐఆర్‌ఎఫ్), ఏఐసీటీఈ అటల్ ర్యాంకింగ్‌తో పాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు తదితర కొలమానాల ఆధారంగా ఈ సీట్లు కేటాయించాల్సిన కళాశాలలను త్వరలో ఎంపిక చేస్తామని ఏఐసీటీఈ పేర్కొంది.
ప్రస్తుతానికి ఏఐసీటీఈ గుర్తించిన పోటీలు ఇవీ..
*రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాకథాన్
*సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
*ఇన్‌స్పైర్ అవార్డు
*ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ పురస్కారం
*కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)
*గూగుల్ సైన్స్ ఫెయిర్
*అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్
*ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్- ధ్రువ్
*నాసా రోవర్ ఛాలెంజ్
*ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ ఫెయిర్
*వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ ఇండియా
*ఫస్ట్ లెగో లీగ్ ఇండియా
*ఫస్ట్ టెక్ ఛాలెంజ్
*ఫస్ట్ రోబోటిక్స్ కాంపిటీషన్
*ఇండియన్ రోబో కప్ జూనియర్
*నేషనల్ సైన్స్ కాంకర్స్
*ఎన్‌ఎస్‌ఎస్, నాసా స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్
*ఇమేజిన్ కప్ (మైక్రోసాఫ్ట్)
*రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఒలింపియాడ్
*ఇన్నోవేటివ్ స్టార్టప్ అవార్డ్
ఎవరు అర్హులు..: