తెలంగాణ

telangana

ETV Bharat / city

Polavaram: రూ.18 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు.. కలెక్టరు, పోలీసులకు బాధితుల ఫిర్యాదులు - ap latest news

Polavaram: ఏపీలోని పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ కాలువ కోసం చేపట్టిన భూసేకరణలో వివాదాల్లో ఉన్న భూములపై ఒకరిద్దరు అధికారులు లబ్ధి పొంది కొందరికి పరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలనూ పక్కనబెట్టి కావాల్సిన వారికి చెల్లింపులు జరపడంతో కలెక్టరు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి.

Polavaram: రూ.18 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు.. కలెక్టరు, పోలీసులకు బాధితుల ఫిర్యాదులు
Polavaram: రూ.18 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు.. కలెక్టరు, పోలీసులకు బాధితుల ఫిర్యాదులు

By

Published : Jul 7, 2022, 10:46 AM IST

Polavaram: ఆంధ్రప్రదేశ్​లోని పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం, ఎడమ కాలువ కోసం చేపట్టిన భూసేకరణలో వివాదాల్లో ఉన్న భూములపై ఒకరిద్దరు అధికారులు లబ్ధి పొంది కొందరికి పరిహారం చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాల ఆదేశాలనూ పక్కనబెట్టి కావాల్సిన వారికి చెల్లింపులు జరపడంతో కలెక్టరు, పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రాజెక్టు వల్ల ముంపును ఎదుర్కోనుందని దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆరు దశల్లో 1,273 ఎకరాలకుపైగా భూమి సేకరించారు. ఇందులో దాదాపు 426 ఎకరాల భూమిపై హక్కులకు సంబంధించిన వివాదాలున్నాయి. వీటిపై కొన్ని కేసులు వివిధ న్యాయస్థానాల్లో పెండింగులో ఉన్నాయి. కొందరు హైకోర్టునూ ఆశ్రయించారు.

‘వివాదాలు తేలేవరకు ఆ భూముల పరిహారం ఎవరికీ చెందకుండా అవసరమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని కోర్టుకు విన్నవించారు. వీరికి అనుకూలంగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. పైగా.. భూముల అవార్డుకు సంబంధించి వివాదాలుంటే భూసేకరణ చట్టం సెక్షన్‌ 77(2) ప్రకారం వాటి పరిహారాన్ని సంబంధిత అథారిటీ వద్ద జమ చేయాల్సి ఉంటుంది. వివాదం పరిష్కారమయ్యాక పంపిణీ చేయాలి.

ఇలా చూసుకున్నా.. కొండమొదలులో 426 ఎకరాలకు సంబంధించిన దాదాపు రూ.25 కోట్లను విశాఖలోని అథారిటీ వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉంది. కానీ సంబంధిత అధికారులు ఆ పని చేయలేదు. ఆ మొత్తం భూసేకరణ కలెక్టరుకు సంబంధించిన ఖాతాలో వేశారు. చాలాకాలం అందులోనే ఉంచారు. ఇంతలో ఈ వివాదాల్లోని భాగస్వాములు ఒక ఉన్నతాధికారిని సంప్రదించినట్లు సమాచారం. దీంతో అందులోని దాదాపు రూ.18కోట్ల వరకు కొందరి పేరున చెక్కులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ చెల్లింపుల్లో ఒకరిద్దరు అధికారులు పెద్ద ఎత్తున లాభపడినట్లు సమాచారం.

దాదాపు 300 ఎకరాలకుపైగా వివాదాస్పద భూములకు అధికారులు ప్రత్యేక ప్రయోజనాలు పొంది చెల్లింపులు జరిపారనేది ప్రధాన ఆరోపణ. దీంతో తాము నష్టపోయామని ఇతర హక్కుదారులు జిల్లా కలెక్టరుకు, ప్రత్యేకాధికారి ప్రవీణ్‌ ఆదిత్యకు ఫిర్యాదులు చేశారు. ప్రత్యేకాధికారి అధికారులను పిలిచి వివరణ కోరారు. ఆ తర్వాత పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కీలకంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details