France's Prime Minister Jean Castex tested covid positive: ఫ్రాన్స్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. బెల్జియం సందర్శన అనంతరం కొవిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో జీన్ కాస్టెక్స్ ఐసోలేషన్ నుంచే తన కార్యకలాపాలను 10 రోజుల పాటు కొనసాగిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయంలోని అధికారులు తెలిపారు. అయితే ప్రధానిలో వైరస్ లక్షణాలు ఉన్నాయా.. లేదా అనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది.
ప్రధాని కాస్టెక్స్ కుమార్తెలలో ఒకరికి సోమవారం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో బెల్జియం పర్యటన అనంతరం కాస్టెక్స్ రెండు రకాల పరీక్షలు చేయించుకోగా.. కరోనాగా నిర్ధరణ అయినట్లు అతని కార్యాలయం తెలిపింది.