Missing: వరదల్లో నలుగురు మహిళలు గల్లంతు
చిత్తూరు జిల్లా బలిజపల్లి చెరువు వద్ద కాజ్‌వేపై వరద నీటిలో నలుగురు మహిళలు కొట్టుకుపోయారు. గల్లంతైన మహిళలు బంగారు పాళ్యం మంండలం టేకుమండ వాసులుగా గుర్తించారు.
01:16 November 19
Missing: వరదల్లో నలుగురు మహిళలు గల్లంతు
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన నలుగురు మహిళలు వాగులో గల్లంతయ్యారు. గురువారం రాత్రి 8.30గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీని ఫుడ్‌పార్కులో పనిచేస్తున్న టేకుమందకు చెందిన లక్ష్మీదేవమ్మ, కస్తూరమ్మ, ఉషారాణి, జయంతి, శిరీష, చిలకమ్మ, శ్రీను విధులు ముగించుకుని రాత్రి ఏడు గంటల సమయంలో ఆటోలో స్వగ్రామానికి బయల్దేరారు. బలిజపల్లి-టేకుమంద వద్దకు రాగానే కాజ్‌వేపై వాగు ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ఆటోను నిలిపేసి డ్రైవర్ వెళ్లిపోయాడు.
అనంతరం వీళ్లు నలుగురూ.. చేయీచేయీ పట్టుకుని కాజ్‌వే దాటేందుకు ప్రయత్నించారు. వాగు ఉద్ధృతికి లక్ష్మీదేవమ్మ(40), కస్తూరమ్మ(40), ఉషారాణి (45), జయంతి(45) నీటిలో పడి గల్లంతయ్యారు. శ్రీను, శిరీష, చిలకమ్మ బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గ్రామస్థుల సాయంతో కస్తూరమ్మ కోసం వెతికారు. చిత్తూరు నుంచి ప్రత్యేక బలగాలు వస్తున్నాయని, గాలింపు ముమ్మరం చేస్తామని ఎస్సై మల్లికార్జునరెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: