తెలంగాణ

telangana

ETV Bharat / city

సముద్రంలో గల్లంతైన ఆరు రోజులకు మత్స్యకారుల ఆచూకీ లభ్యం.. - కృష్ణా జిల్లాలో గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితం

Fishermen safe: ఆరు రోజుల క్రితం సముద్ర తీరంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ తెలిసింది. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్టు కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి సమాచారం అందించారు.

Fishermen safe
Fishermen safe

By

Published : Jul 7, 2022, 4:50 PM IST

సముద్రంలో గల్లంతైన ఆరు రోజులకు మత్స్యకారుల ఆచూకీ లభ్యం..

Fishermen safe: ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 6 రోజుల క్రితం అంతర్వేది సముద్ర తీరంలో గల్లంతైన నలుగురు మత్స్యకారుల ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గల్లంతైన నలుగురు మత్స్యకారులు అమలాపురం సమీపంలోని కొత్తపాలెం వద్ద సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరిన మత్స్యకారులు.. కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

ఆరు రోజులు క్రితం క్యాంబెల్‌పేటకు చెందిన జాలర్లు విశ్వనాథపల్లి చినమస్తాన్, రామాని నాంచార్లు, చెక్క నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావు చేపల వేట కోసం అంత్వర్వేది వైపు వెళ్లారు. అప్పటినుంచి వీరి ఆచూకీ లేకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో..అధికారులు గాలింపు చేపట్టారు. ఇవాళ ఒంటి గంట సమయంలో వీరు కొత్తపాలెం వద్ద ఒడ్డుకు చేరుకున్నారని కృష్ణా జిల్లా ఇంఛార్జ్‌ కలెక్ట్‌ర తెలిపారు. మత్స్యకారులను స్వస్థలానికి తీసుకువస్తామని చెప్పారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details