కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో చేరిన నలుగురు - gandhi hospital with corona virus symptoms
11:05 February 05
కరోనా వైరస్ లక్షణాలతో మరో నలుగురు రోగులు ఈ రోజు గాంధీ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం సైతం నలుగురు రోగులు గాంధీలో చేరగా వారికి చేసిన వైద్య పరీక్షల్లో ఇద్దరికి కరోనా నెగెటివ్ రాగా.. మరో ఇద్దరికీ స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. స్వైన్ ఫ్లూ సోకినట్టు గుర్తించిన వారిని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తుండగా మరో ఇద్దరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యి ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
ఈ రోజు చేరిన నలుగురు సైతం చైనా నుంచి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే వీరికి సంబంధిచిన నమూనాలను సేకరించిన వైద్యులు గాంధీలోని వైరాలజీ ల్యాబ్ లో కరోనా , స్వైన్ ఫ్లూ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి వారికి సంబంధించిన కరోనా వైరస్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.