దిశ హత్యకేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ - justice for disha

07:14 December 06
దిశ హత్యకేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్
దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను కాల్చిన చోటే ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు.