తెలంగాణ

telangana

ETV Bharat / city

'294మంది ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోండి' - padmanbhareddy latest news

గవర్నర్ తమిళిసైకి... సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై సీఐడీ దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని కోరారు. అక్రమాలతో సంబంధం ఉన్న 294 మంది ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందులో చాలా మంది తెరాసలో చేరడం వల్లే చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.

forum for good governance secretary padmanbhareddy
forum for good governance secretary padmanbhareddy

By

Published : Feb 6, 2021, 9:12 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై సీఐడీ దర్యాప్తు వేగంగా జరిగేలా చూడాలని గవర్నర్ తమిళిసైకి... సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. అవినీతికి పాల్పడిన వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని హైకోర్టు ఆదేశించినా... ఒక్క పైసా వసూలు చేయకపోవడమేంటని పద్మనాభరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రూ. 235 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు తేలిందని పేర్కొన్నారు. 508 మంది ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి... వాళ్లలో 150 మందిని సస్పెండ్ చేసి, మరో 68 మందిని ఉద్యోగం నుంచి తొలగించారని వివరించారు.

అక్రమాలతో సంబంధం ఉన్న 294 మంది ప్రజాప్రతినిధులపైన క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని... అందులో చాలా మంది తెరాసలో చేరడం వల్ల చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 2014లో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై విచారణను సీఐడీకి అప్పగించినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీర్ల సాయం కావాలని సీఐడీ కోరినా... ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల దర్యాప్తు నిలిచిపోయిందని తెలిపారు.

రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 10వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని పద్మనాభరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల అక్రమార్కులను వదిలేస్తే.... రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలోనూ అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పద్మనాభ రెడ్డి లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ఈనెల 10న నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన

ABOUT THE AUTHOR

...view details