తెలంగాణ

telangana

ETV Bharat / city

'హుజూరాబాద్​ ఉపఎన్నిక ముగిసే వరకు దళిత బంధు నిలిపేయండి'

హుజూరాబాద్​ ఉపఎన్నిక ముగిసే వరకు దళిత బంధు పథకాన్ని నిలిపేయాలని.. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే హుజూరాబాద్​లోనే ఈ పథకాన్ని తొలుత అమలుచేస్తున్నారని.. పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

forum for good governance
forum for good governance

By

Published : Jul 28, 2021, 10:14 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసే వరకు దళితబంధు పథకం అమలు నిలిపేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుపరిపాలనా వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న దళితబంధు పథకం మంచిదే అయినా.. హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ నియోజవర్గంలోనే తొలుత అమలుచేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్​పైన ఉందన్నారు.

హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా అంగీకరించారని పద్మనాభరెడ్డి చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని హుజూరాబాద్​ ఉపఎన్నిక ముగిసేవరకు దళిత బంధు పథకం అమలును నిలుపుదల చేయాలని ఈసీని కోరారు. ఎన్నిక అనంతరం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలుచేయాలని కోరారు.

ఇదీచూడండి:MLA Rajagopal Reddy: 'ఈటలను ఓడించడానికే.. దళితబంధు పథకం'

ABOUT THE AUTHOR

...view details