హైదరాబాద్‌లో 350 ఆస్పత్రులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. నగరంలోని ఆస్పత్రుల బయో వేస్టేజ్‌ను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధిచేయడం లేదని.. ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి పద్మనాభరెడ్డి ఫిర్యాదు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అంశాలను ఫిర్యాదులో జతచేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో వెస్టేజ్ లిక్విడ్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
"హైదరాబాద్‌లో 350 ఆస్పత్రులకు అనుమతి లేదు" - ఫోరంఫర్ గుడ్ గవర్నన్స్
హైదరాబాద్‌లో అధిక శాతం ఆస్పత్రులు బయో వేస్టేజ్‌ను శుద్ధిచేయడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ ఆరోపించింది. సుమారు 350 ఆస్పత్రులకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.
ఆస్పత్రులపై సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నన్స్ ఫిర్యాదు