తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆగ్రహావతి: 30వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు - formers protest continue for amaravathi andhrapradesh

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 30వ రోజుకు చేరాయి. భోగి, సంక్రాంతి జరుపుకోని రైతులు.. ఇవాళ కనుమ పండుగకూ దూరంగా ఉండనున్నారు. రాత్రి పలు గ్రామాల్లో కొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. నేడు సీపీఐ నాయకులు.. అమరావతి కోసం మృతిచెందిన రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.

formers protest continue for amaravathi andhrapradesh
ఆగ్రహావతి: 30వ రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల ఆందోళనలు

By

Published : Jan 16, 2020, 7:25 AM IST

మూడు ముక్కలాట వద్దు.. అమరావతే ముద్దు అంటూ ఆంధ్రప్రదేశ్​ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామన్న ప్రకటనే తమకు నిజమైన పండగంటూ భోగి, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉన్న రైతులు... కనుమ రోజూ దీక్షా శిబిరాల్లోనే గడపనున్నారు. ఏపీ నలుమూలల నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. సంక్రాంతి పండగకు సైతం జరుపుకోకుండా రైతులు ఉపవాస దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా రాజధాని గ్రామాలను పర్యటించారు. రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అమరావతి సాధనే ప్రతి ఒక్కరి ఊపిరి కావాలని పిలుపునిచ్చారు.

రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఉద్యమం చేస్తామని మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి అన్నారు. రాజధాని కోసం అందరూ యుద్దానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంతానికి చరిత్రలో ప్రాముఖ్యత ఉందని ఆత్యాధ్మిక వేత్త డా.కొండవీటి జ్యోతీర్మయి అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు.

సంతకాలు తీసుకునే పనిలో పోలీసులు..

రాజధాని గ్రామాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. రైతులను తాము వేధించలేదని, వారిని ఈడ్చుకెళ్లలేదని పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు రైతుల వద్ద సంతకాలు తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల చర్యలతో రైతులు విభేదించారు. హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతులు,ఐకాస నేతలు డీజీపీని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసు బలగాలు తగ్గించారు.

సీపీఐ నేతల పర్యటన..

ఈరోజు సీపీఐ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు పలువురు నేతలు పెనుమాక,నవ్వులూరు, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం,మందడం, వెలగపూడి , తుళ్లూరు, తాడికొండ గ్రామాల్లో పర్యటించనున్నారు . రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతిచెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు. నేడు కూడా కనుమ పండగకు దూరంగా ఉండి రైతులు ఉద్యమం చేయనున్నారు .

ఆగ్రహావతి: 30వ రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతుల ఆందోళనలు


ఇదీ చదవండి : ఇక పాస్​పోర్టు పొందడం మరింత సులభం

ABOUT THE AUTHOR

...view details