రాష్ట్రంలో అర్హులైన రైతులందరికీ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కరోనా విపత్తులోనూ కర్షకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం అందిస్తున్నారని... నాల్గో రోజు 6.41 లక్షల మంది అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయం కింద రూ.1,123.78 కోట్లు జమ చేశామని వెల్లడించారు. ఇప్పటి వరకు 48.75 లక్షల మంది రైతులకు రూ.4,079.48 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
'ఆదాయంతో పనిలేదు.. రైతుబంధుపై వెనకడుగు వేసేది లేదు' - telangana news
కరోనాతో రాష్ట్రం ఆదాయం కోల్పోయినా రైతులకు సాయం విషయంలో సీఎం కేసీఆర్ వెనకడుగు వేయలేదని మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 48.75 లక్షల మంది రైతులకు రూ.4,079.48 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 8 వరకు 60.88 లక్షల అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందుతుందని స్పష్టం చేశారు.
ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 81.59 లక్షల ఎకరాలకు ఈ పెట్టుబడి సాయం అందజేశామని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8 వరకు 60.88 లక్షల అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందుతుందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ... దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు. కరోనాతో రాష్ట్రం ఆదాయం కోల్పోయినా రైతులకు సాయం విషయంలో కేసీఆర్ వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశమని నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి :కొవిడ్ వాక్సిన్ డ్రైరన్ కోసం ఏర్పాట్లు పూర్తి