తెలంగాణ

telangana

ETV Bharat / city

చైనా- అమెరికా మధ్య యుద్ధం జరగొచ్చు: ట్రంప్ - యుద్ధం

చైనా- అమెరికా మధ్య యుద్ధం జరగొచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. తైవాన్‌కు సమీపంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. చైనా, యూఎస్ అధికారులు చర్చలు జరపాల్సి ఉండగా.. ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

Donald Trump
Donald Trump

By

Published : Oct 7, 2021, 8:28 PM IST

చైనాతో యూఎస్ "యుద్ధం" చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం బలహీనంగా.. అవినీతిమయంగా ఉందని విమర్శించారు. అమెరికాను బీజింగ్ ఇక ఏమాత్రం గౌరవించబోదన్నారు.

తైవాన్‌కు దగ్గరగా చైనా సైన్యం రికార్డు స్థాయిలో ఎయిర్ డ్రిల్స్ నిర్వహించడంపై.. చైనా, యూఎస్ ఉన్నత అధికారులు స్విట్జర్లాండ్‌లో చర్చలు జరుపనున్నారు. ఈ సమయంలో ట్రంప్​ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:అమెరికా, చైనా దేశాధ్యక్షుల వర్చువల్​ భేటీ.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details