తెలంగాణ

telangana

ETV Bharat / city

'మంత్రి పువ్వాడను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి' - governor protocol issue

Renuka chowdhury Comments: గవర్నర్ వ్యవస్థను అగౌరవపరిచేటట్లు వ్యవహరించడం, ప్రోటోకాల్ పాటించకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. భాజపా కార్యకర్త చనిపోతే అందుకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​పై చర్యలెందుకు తీసుకోవడంలేదని నిలదీశారు.

Former Union Minister Renuka chowdhury comments on trs government
Former Union Minister Renuka chowdhury comments on trs government

By

Published : Apr 19, 2022, 5:36 PM IST

Renuka chowdhury Comments: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యవస్థను అగౌరవపరిచేటట్లు వ్యవహరించడం, ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు. ఐపీఎస్, ఐఏఎస్‌లు ప్రభుత్వానికి తొత్తులుగా మారాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. భాజపా కార్యకర్త చనిపోతే అందుకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​పై చర్యలెందుకు తీసుకోవడంలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అజయ్‌కుమార్​ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించి.. ఏ1 నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు.

"రాష్ట్ర గవర్నర్​, అందులోనూ ఒక మహిళ.. రిమోట్​ ట్రైబల్​ ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు కనీస ప్రొటోకాల్​ పాటించటం లేదు. ఐఏఎస్​, ఏపీఎస్​ అధికారులను కేంద్రం నియమిస్తుంది. అలాంటి వాళ్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు తొత్తులుగా మారుతున్నారు. ఒక ఎస్పీ పర్యటనకు.. ఎవరైన ఎస్సై రాకపోతేనే చర్యలు తీసుకుంటారు. అలాంటి ఒక రాష్ట్ర గవర్నర్​.. నక్సల్​ ప్రభావిత రిమోట్​ ట్రైబల్​ ఏరియాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రొటోకాల్​ పాటించట్లేదంటే.. రాష్ట్రం ఎలాంటి పరిపాలన ఉందో అర్థమవుతోంది. ఇది కేవలం గవర్నర్​ గురించే కాదు.. ఒక రాజ్యాంగబద్దమైన పద్ధతులుంటాయి. వాటిని పక్కకు పెట్టేసి.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు చేస్తుంటే.. రాష్ట్రంలో చట్టం ఉందా..?" -రేణుకా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి

'మంత్రి అజయ్‌కుమార్​ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలి'

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details