లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, భారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ భాగస్వామ్యంతో "చట్టబద్దపాలన-సంస్కరణలు" అనే అంశంపై వర్చువల్ వేదికగా నిర్వహిస్తున్న రెండో విడత జాతీయ సదస్సు ఇవాళ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆధునిక పోలీసు వ్యవస్థలో సవాళ్లు అనే అంశంపై కొనసాగుతున్న చర్చలో...కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య, కామన్వెల్త్ మానవ హక్కుల సీనియర్ సలహదారు మజా దరువాల, ఎస్.వీ.పీ జాతీయ పోలీస్ అకాడమీ పూర్వ డైరెక్టర్ కమల్ కుమార్, యూపీ పూర్వ డీజీపీ వీ.ఎన్.రాయ్, కేరళ మాజీ డీజీపీ జాకోబ్ పున్నోస్ తదితరులు పాల్గొన్నారు.
'చట్టబద్ధంగా విధులు నిర్వహించడం చాలా ముఖ్యం' - Former Union Home Secretary Padmanabhaiah
పోలీస్ ఉద్యోగం కఠినమైనదైనా.. చట్టబద్ధంగా విధులు నిర్వహించడం చాలా ముఖ్యమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు. లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నిర్వహిస్తోన్న "చట్టబద్ధపాలన-సంస్కరణలు" అనే అంశంపై జరుగుతున్న సదస్సులో పాల్గొన్నారు.
!['చట్టబద్ధంగా విధులు నిర్వహించడం చాలా ముఖ్యం' Former Union Home Secretary Padmanabhaiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10703809-434-10703809-1613811411424.jpg)
కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఆఫ్ బ్యూరో, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్‌లు.. పోలీసింగ్‌పై పరిశోధన చేస్తున్నాయని పద్మనాభయ్య అన్నారు. ఆధునిక పోలీసింగ్ దేశాన్ని బట్టి మారుతుందని, చట్టబద్ధంగా పాలించడం, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం, ప్రజలకు రక్షణ కల్పించడం వంటివి ఆధునిక పోలీసింగ్‌కు సవాళ్లుగా మారాయని తెలిపారు. పోలీస్ ఉద్యోగం కఠినమైనదైనా.. చట్టబద్ధంగా విధులు నిర్వహించడం చాలా ముఖ్యమని కేంద్ర పద్మనాభయ్య అభిప్రాయపడ్డారు.
- ఇదీ చదవండి:తెలంగాణకు రూ.1940.95 కోట్ల జీఎస్టీ పరిహారం